వాట్సాప్ చాటింగ్ సాక్ష్యంగా చెల్లదు : ఢిల్లీ హైకోర్టు

వాట్సాప్ చాటింగ్ సాక్ష్యంగా చెల్లదు : ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ హైకోర్టు సర్టిఫికేట్ లేకుండా వాట్సాప్ సంభాషణలను సాక్ష్యంగా పరిగణించలేమని జూలై 2న చెప్పింది.1872 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం.. వాట్సాప్ సంభాషణ ఖచ్చితమైన సర్టిఫికేట్‌ ఉంటేనే చట్టపరమైన చర్యలలో సాక్ష్యంగా చెల్లుబాటు అవుతుందని కోర్టు తెలిపింది. డెల్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ దాఖలు చేసిన పిటిషన్‌లో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2022లో జిల్లా వినియోగదారుల కమీషన్‌లో డెల్‌పై అడీల్ ఫిరోజ్ దాఖలు చేసిన ఫిర్యాదు కేసులో ఢిల్లీ హైకోర్టు దాన్ని సమర్థించింది. డెల్ కంపెనీ ఫిరోజ్‌తో వాట్సాప్ సంభాషణ యొక్క స్క్రీన్‌షాట్‌ను కేసులో సాక్ష్యాలుగా సమర్పించింది. 

ఫిర్యాదు కాపీ, సర్టిఫికేట్లు లేవని డెల్ కంపెనీ తరపు న్యాయవాది చెప్పారు. ఆ పత్రాలు 2023 జనవరి 31న ఫైలింగ్ గడువుకు కొంతకాలం ముందు మాత్రమే న్యాయవాదికి అందజేయబడ్డాయి. అయితే, తప్పనిసరి సర్టిఫికేట్ లేనందున వాట్సాప్ సంభాషణలను సాక్ష్యంగా చెల్లదని హైకోర్టు దిగువ కన్యూమర్స్ కమిషన్ తీర్పును కోర్టు సమర్థించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం రిట్ పిటిషన్ నేపథ్యంలో వాట్సాప్ స్క్రీన్‌షాట్‌ను పరిగణించలేమని కోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ముందు ఈ సంభాషణలు సమర్పించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తేలింది.