ఎర్రకోటను మాకు అప్పగించండి .. ఢిల్లీ హైకోర్టులో మొఘల్ వారసుల పిటిషన్‌‌‌‌

ఎర్రకోటను మాకు అప్పగించండి .. ఢిల్లీ హైకోర్టులో మొఘల్ వారసుల పిటిషన్‌‌‌‌

న్యూఢిల్లీ:  భారత ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎర్రకోటను తమకు అప్పగించాలని మొఘల్‌‌‌‌ పూర్వీకులు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఎర్రకోటను తమ పూర్వీకులు నిర్మించారని, దానిని తమకు అప్పగించాలంటూ మొఘల్ చక్రవర్తి బహదూర్‌‌‌‌‌‌‌‌ షా జఫార్‌‌‌‌‌‌‌‌ II ముని మనమడి భార్య సుల్తానా బేగం 2021, డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. 

గతంలో బ్రిటీష్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌ ఇండియా కంపెనీ తమ నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రకోటను అప్పగించాలని పిటిషన్‌‌‌‌లో పేర్కొన్నారు. అయితే, 1857లో మొదటి స్వాతంత్ర్య ఉద్యమం తర్వాత మొఘలుల ఆస్తులు, కట్టడాలను బ్రిటీషర్లు ఆక్రమించుకున్నారని, దాదాపు 150 ఏండ్ల తర్వాత కోర్టును ఆశ్రయించడాన్ని బెంచ్‌‌‌‌ తప్పుబట్టింది. అప్పీల్‌‌‌‌లో జరిగిన ఆలస్యం కారణంగా ఈ కేసును కొట్టివేస్తున్నామని వెల్లడించింది.