ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టులో ఊరట లభించింది. జైలులో ఉన్న ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు 2023 ఏప్రిల్ 04 గురువారం రోజున తిరస్కరించింది. సీఎం పదవిలో కొనసాగాలా వద్ద అనే అంశం కేజ్రీవాల్ వ్యక్తిగతంగా నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది కోర్టు తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ కస్టడీలో ఉన్నందున కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ వారం రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది.హిందూ సేన జాతీయ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త విష్ణు గుప్తా ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ అంశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.
దీనిపై దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోడాతో కూడిన బెంచ్ తెలిపింది. దీంతో జైలు నుంచే బాధ్యతలు నిర్వర్తించే అవకాశం కేజ్రీవాల్‌కు కలిగింది. కాగా ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ను తొలగించాలంటూ పిల్ దాఖలు కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. . సూరజ్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి మార్చి28న పిటిషన్ దాఖలు చేయగా దానిని న్యాయస్థానం కొట్టివేసింది.