ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పనులు చేసినా, లేదా ప్రచారం చేసినా జరిమానాను రూ. 2లక్షలకు తగ్గిస్తామని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. 5G సాంకేతికతతో ప్రజలు, ఇతర జంతుజాలానికి ముప్పు ఉంటుందంటూ గతేడాది జుహీచావ్లా, మరో ఇద్దరు పర్యావరణ వేత్తలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెలబ్రిటీ కావడంతో ప్రచారం కోసమే ఈ పిటిషన్ దాఖలు చేశారంటూ రూ. 20 లక్షల జరిమానా విధించింది. ప్రజల కోసం పనిచేస్తే.. జరిమానా తగ్గిస్తామంటూ కోరుతూ జస్టిస్ విపిన్ సంఘి, జస్మీత్ సింగ్‌ల ధర్మాసనం ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (DSLSA) కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. జరిమానా మొత్తాన్నీ మాఫీ చేయలేమని, అయితే రూ. 20 లక్షల నుండి రూ. 2 లక్షలకు తగ్గించగలమని తెలిపింది. ఈ అప్పీల్‌పై తన స్పందనను తెలపాలని, తదుపరి విచారణను జనవరి 27కి వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ కోర్టు తెలిపింది.
మరిన్ని వార్తల కోసం..