మోహన్ బాబుకి హై కోర్టులో ఊరట.. వెంటనే వాటిని తొలగించాలని తీర్పు..

మోహన్ బాబుకి హై కోర్టులో ఊరట.. వెంటనే వాటిని తొలగించాలని తీర్పు..

తెలుగు ప్రముఖ సినీ నిర్మాత, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కొన్ని రోజులుగా తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు. ఇటీవల తన ఇంట్లో ఆస్తి తగాదాల కారణంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు, కోర్టు పిటీషన్లు, మీడియా రిపోర్టర్ పై దాడి ఇలా దాదాపుగా 2 వారాల నుంచి ఎదో ఒక సంఘటనతో సోషల్ మీడియా, ఇంటర్నెట్ లో వార్తల్లో నిలుస్తున్నాడు. దీంతో ఎవరికితోచింది వారు రాస్తూ మంచు ఫ్యామిలీపై నెగిటివ్ గా ప్రచారాలు చేస్తున్నారు. 

ఈ విషయంపై మంచు మోహన్ బాబు ఢిల్లీ హై కోర్టుని ఆశ్రయించాడు. ఇందులోభాగంగా తన ఫోటోలు, వాయిస్‌ను గూగుల్‌, సోషల్ మీడియాలో వాడొద్దని ఢిల్లీ హైకోర్టులో అలాగే గూగుల్ నుంచి తొలగించేందుకు ఆదేశాలు జారీ చెయ్యాలని  పిటీషన్ దాఖలు చేశాడు. మోహన్ బాబు పిటీషన్ ని శనివారం హైకోర్టు పరిశీలించి సానుకూలంగా స్పందించింది. ఇందులో భాగంగా గూగుల్ నుంచి మోహన్ బాబు కంటెంట్‌ను తొలగించాలని తీర్పు ఇచ్చింది.

ALSO READ : ఆర్.నారాయణమూర్తికీ ఓ లవ్ స్టోరీ ఉంది.. పెళ్లి వరకు వెళ్లారు కానీ.. డబ్బే కారణమా..!

ఈ విషయం ఇలా ఉండగామంచు మోహన్ బాబు ఇటీవలే తన ఇంటివద్ద ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్న సమయంలో న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన ప్రముఖ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ పై మైక్ లాక్కొని దాడి చేశాడు. రిపోర్టర్ గాయపడటంతో మోహన్ బాబు  అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కి అప్లయ్ చేసుకున్నప్పటికీ బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు నిరకరించింది.