దే శ రాజధాని ఢిల్లీలోని జంగ్‌పురాలోని భోగల్‌లో ఓ భారీ దోపిడీ కేసును పోలీసులు చేధించారు. నిందితులను ఛత్తీస్ ఘడ్ లో గుర్తించిన ఢిల్లీ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను 13 లక్షల నగదు, 18 కిలోల బంగారం, వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీలోని భోగల్‌లోని ఉమ్రావ్ జ్యువెలర్స్ షోరూంలో సెప్టెంబర్ 25 అర్దరాత్రి దొంగలు చొరబడి సుమారు రూ.25 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. చాలా సేపు పక్కా ప్రణాళికతో జ్యువెలరీ షోరూం పైకప్పుకు, గోడకు రంధ్రాలు చేసి స్ట్రాంగ్‌రూమ్‌లోకి దొంగలు ప్రవేశించారని పోలీసులు తెలిపారు. చోరీ చేయడానికి ముందు దొంగలు సీసీటీవీ కెమెరాలను డిస్‌కనెక్ట్ చేశారు. లాకర్లు ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌కు రంధ్రం చేసి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో దొంగలు సంచరిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు...ఢిల్లీ పోలీసు బృందం ఛత్తీస్‌గఢ్ వెళ్లింది. నిందితులు శ్రీవాస్తవ, శివ చంద్ర వంశీ లతో మరొకరిని అదుపులోకి విచారించారు.
ALSO READ : ఇంటర్నేషనల్ క్రికెట్ మాఫియా : రూ.350 కోట్ల బెట్టింగ్ ముఠా అరెస్ట్
నాలుగు అంతస్తులు ఉన్న ఆ భవనంలోకి పై అంతస్తు నుంచి దొంగలు చొరబడ్డారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌ను దొంగలు పగలగొట్టారు. స్ట్రాంగ్‌రూమ్‌లోకి ప్రవేశించేందుకు దొంగలు గోడకు భారీ రంధ్రాన్ని డ్రిల్ చేశారు. లాకర్‌లో ఉన్న ఆభరణాలతో పాటు షోరూమ్ డిస్‌ప్లేలో ఉన్న బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు. జ్యువెలరీ షోరూంలోని ఫుటేజీని, సమీపంలో అమర్చిన సీసీ కెమెరాలను స్కాన్ చేయడమే కాకుండా, సమీపంలోని వ్యక్తులను కూడా పోలీసులు విచారించారు. నిందితుల నుంచి 13 లక్షల నగదు, 18 కిలోల బంగారం, వజ్రాలు స్వాధీనం చేసుకున్నట్లు బిలాస్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ సంతోష్ సింగ్ తెలిపారు.