లెఫ్టినెంట్ గవర్నర్ కే సంపూర్ణ అధికారం... ఢిల్లీపై కేంద్రం సంచలన నిర్ణయం..

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు  సంపూర్ణ అధికారం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలో ఏదైన కమిషన్, బోర్డులను ఏర్పాటు చేసేందుకు పవర్ను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఢిల్లీ మహిళా కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వంటి ఏదైన కమిషన్ లకు సభ్యులను ఢిల్లీ ఎల్జీ నియమించుకోవచ్చని ఒక నోటిఫికేషన్లో తెలిపింది కేంద్రం.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 239క్లాజ్ వన్ లోని ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది. గెజిట్ వెలువడిన వెంటనే ఎంసీడీ వార్డు కమిటీ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారులను నియమించారు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. అయితే  ఈ నిర్ణయాన్ని ఖండించారు ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్.