ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత

ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వారాంతపు కర్ఫ్యూను ఎత్తేశారు. అయితే రాత్రిపూట కర్ఫ్యూ మాత్రం కొనసాగనుంది. మార్కెట్లలో షాపులకు విధించిన సరి, బేసి విధానాన్ని కూడా తొలగించారు. షాపులను ప్రతిరోజూ తెరిచేందుకు.. సినిమా హాళ్లు, బార్లు, రెస్టారెంట్లను 50 శాతం సామర్థ్యంతో నడిపేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వివాహ వేడుకల్లో హాజరయ్యే వారి  సంఖ్యను రెండొందలకు పెంచింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను యాభై శాతం కెపాసిటీతో నడిపేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుతుండటంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే స్కూళ్లను మాత్రం మూసేసి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా ఆంక్షల ఎత్తివేతపై ఢిల్లీ గవర్నమెంట్ కు, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ మధ్య నిర్వహించిన మీటింగ్ లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, ఢిల్లీలో గత 24 గంటల్లో 5 వేల కొవిడ్ కేసులు నమోదయ్యాయని, కరోనా అదుపులో ఉందని ఆరోగ్య శాఖ మంత్రి  సత్యేంద్ర జైన్ తెలిపారు.  

మరిన్ని వార్తల కోసం:

పెళ్లి కూతురైన ‘నాగిని’ హీరోయిన్

ఉద్యోగం రాక బాధతో రోడ్డెక్కిన యువకుడు

కరోనా సోకిన గర్భిణికి నార్మల్ డెలివరీ