
లిక్కర్ స్కాం కేసులో కవిత కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.. అయితే కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ దాఖలు చేసిన ఏడో చార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆమె కస్టడీని జులై 3 వరకు పొడిగించింది. అయితే సప్లమెంటరీ చార్జ్ షీట్ లో ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది.
లిక్కర్ స్కాంలో రూ. 1100 కోట్ల నేరం జరిగిందని చార్జ్ షీట్ లో పేర్కొంది ఈడీ. ఇందులో 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని తెలిపింది. 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని పేర్కొంది. కవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసిందని.. 292 కోట్ల నేరంలో ఆమె పాత్ర ఉందని చార్జ్ షీట్ లో ఈడీ పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు ముందు వెనక పలుసార్లు విజయ్ నాయర్ తో ఎమ్మెల్సీ కవిత సమావేశం అయ్యారని ఈడీ తెలిపింది. సౌత్ గ్రూపు నుంచి వచ్చిన 100 కోట్ల రూపాయల ముడుపులను గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసింది. ఇండో స్వీట్స్ కంపెనీలో సౌత్ గ్రూప్ 65% వాటా. కవిత పాత్రపై ఇప్పటికే అరెస్టు అయిన నిందితుల వాంగ్మూలాలను తీసుకున్నాం. ఢిల్లీ లిక్కర్ వ్యాపారానికి సంబంధించి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మనీశ్ సిసోడియాలతో కవిత పలు సార్లు మాట్లాడింది. లిక్కర్ వ్యాపారంలో విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ కు కోఆర్డినేటర్ గా వ్యవహరించాడు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఆధారాలను ధ్వంసం చేసింది. విచారణ సందర్భంగా కవిత తప్పుడు సమాచారం ఇచ్చారు. 9 ఫోన్ లను ఈడీకి కవిత ఇచ్చారు. ఈ క్రమంలో పొలిటికల్ షో చేశారని చార్జ్ షీట్ లో తెలిపింది ఈడీ.
లిక్కర్ కేసులో 18 మందిని అరెస్ట్ చేశాం
పీఎంఎల్ఏ సెక్షన్ 44, 45 కింద సప్లమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది ఈడీ. పీఎంఎల్ఏ సెక్షన్ 17 ప్రకారం తెలంగాణ, ఢిల్లీ, ఏపీ, మహారాష్ట్ర, పంజాబ్,హర్యానా, తమిళనాడు , ఇతర ప్రాంతాల్లో 24 స్థానాల్లో సోదాలు నిర్వహించాం. ఇప్పటి వరకు లిక్కర్ స్కాంలో 18 మందిని అరెస్ట్ చేశాం. ఈ కేసులో బెయిల్ పై ఉన్న వారిలో శరత్ చంద్రా రెడ్డి, దినేష్ అరోరా, రాఘవ మాగుంట, రాజేశ్ జోషి, గౌతమ్ మల్హోత్రా, బినోయ్ బాబు, సంజీవ్ సింఘ్, వినోద్ చౌహాన్, శరత్ చంద్రా రెడ్డిని ఏ7, రాఘవ మాగుంట ఏ18 గా. పీఎంఎల్ ఏ సెక్షన్ 50(2), (3)ప్రకారం కవిత, మాగుంట శ్రీనివాసులు, రాఘవ మాగుంట, గోపి కుమరన్, శరత్ చంద్ర రెడ్డి, సమీర్ మహేంద్రు, దినేష్ అరోరా, అరుణ్ పిళ్లై, వి. శ్రీనివాస్ ఇతరుల వాంగ్మూలాల రికార్డు చేశాం. మొత్తం 49 మందిని విచారించామని ఈడీ పేర్కొంది.