ఢిల్లీ లిక్కర్ స్కామ్:కేజ్రీవాల్ సహా ఆరుగురికి సమన్లు

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌‌‌‌ను నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ వేసిన నాలుగో చార్జ్​షీట్‌‌‌‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. కేజ్రీవాల్ సహా అందులో నిందితులుగా పేర్కొన్నా ఆరుగురికి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ వేసిన నాలుగో చార్జ్​షీట్‌‌‌‌పై మంగళవారం కోర్టు విచారణ చేపట్టింది. చార్జ్​షీట్‌‌‌‌లో పేర్కొన్న ఆరుగురు నిందితులు కేజ్రీవాల్, దుర్గేశ్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిశ్ మాథుర్, పి.శరత్ చంద్రారెడ్డికి సమన్లు జారీ చేసింది. సీఎం కేజ్రీవాల్‌‌‌‌తో పాటు ఇతర నిందితులపై విచారణకు తగిన ఆధారాలు ఉన్నాయని స్పెషల్ జడ్జి కావేరీ బవేజా తెలిపారు. తరుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేశారు.