ఢిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న తొమ్మిదివేలు కేసులు నమోదు అయితే.. తాజాగా గడిచిన 24 గంటల్లో57,132మందికి టెస్టులు చేస్తే... 6,028 పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. ఇక కరోనా నుంచి 9127 మంది విజయవంతంగా కోలుకున్నారు. కరోనా కారణంగా 31 మంది చనిపోయారు దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 25వేల 681కు చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో 42వేల 10 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కోవిడ్ పాజిటివిటీ రేటు ఢిల్లీలో 10.55% శాతంగా ఉంది. మరోవైపు ముంబైలో తాజాగా 1815 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ బారిన పడి గడిచిన 24 గంటల్లో 10 మంది చనిపోయారు. ప్రస్తుతం ముంబైలో 22వేల 185 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Delhi logs 6,028 COVID cases (57132 tests), 9,127 recoveries, and 31 deaths today
— ANI (@ANI) January 25, 2022
Active cases: 42,010
Death toll: 25,681
Today's positivity rate: 10.55% pic.twitter.com/VmUgFxLkpk