షాకింగ్ సీసీఫుటేజ్..కాళ్లు మొక్కొ కాల్చి చంపారు..ఢిల్లీలో మామ అల్లుళ్ల మృతి

షాకింగ్ సీసీఫుటేజ్..కాళ్లు మొక్కొ కాల్చి చంపారు..ఢిల్లీలో మామ అల్లుళ్ల మృతి

ఎవరైనా మన కాళ్లు మొక్కుతున్నారు అంటే ఏమనుకుంటాం.. వాళ్లు మనకు విధేయులు..ఆశీస్సులు తీసుకుంటున్నారు అనుకుంటాం కదా..ప్రాణాలు తీసేందుకు వచ్చారు అని ఊహించరు కదా.. కానీ ఢిల్లీలో దీపావళి పండుగ రోజు నిజంగానే కాళ్లు మొక్కి ఓ వ్యక్తిని కాల్చి చంపారు దుండగులు.. అంతేకాదు అడ్డు వచ్చిన అతని మేనల్లుణ్ని కూడా చంపేశారు. అంతటితో ఆగలేదు..మృతిని పదేళ్ల కొడుకు, అతని కుటుంబ సభ్యులపైనా కాల్పులు జరిపారు. గురువారం ( అక్టోబర్ 31) రాత్రి ఢిల్లీ లో జరిగిన సంఘటనకు సంబంధించిన సీసీఫుటేజీ వీడియో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలోని బీహారీ కాలనీలో నివాసముంటున్న ఆకాష్, అతని అల్లుడిని తుపాకీతో కాల్చి చంపారు దుండగులు. అప్పటివరకు వారంతా దీపావళి సంబరాల్లో ఆనందం గా గడిపింది ఆ కుటుంబం. స్వీట్లు పంచుకున్నారు. ఇంటి ముందు టపాసులు పేల్చారు.ఇంతలో యమదూతల్లా ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వినయంగా నటిస్తూ వంగి పాదాలకు నమస్కారం చేశారు. మొక్కినట్టే మొక్క ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న గన్ తో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆకాష్, అతనిమేనల్లుడు అక్కడికక్కడే మృతిచెందారు. 

Also Read : దీపావళి ఎఫెక్ట్.. పొల్యూషన్తో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి 

మృతుడు ఆకాష్‌, అతని కుమారుడు, మేనల్లుడు తమ ఇంటి బయట దీపావళి వేడుకల్లో నిమగ్నమై ఉండగా కాల్పులు జరిగిన క్షణాలను సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చారు.ఒకరు దిగి వారితో ఆకాష్ తో మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత తుపాకీ తీసి ఆకాష్‌పై కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన తర్వాత ఘటనా స్థలం నుంచి పారిపోతుండగా ఆకాష్ అల్లుడు అడ్డుకోగా అతనిపై కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పదేళ్ల బాలుడితోపాటు మరొకరికి గాయాలయ్యాయి. ఊహించని ఈ ఘటన తో అక్కడివారంతా షాక్ కు గురయ్యారు. తేరుకొని వారిని గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు.  

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు కారణాలపై విచారణ మొదలుపెట్టారు. గతంలో ఆకాష్ కు ఇతరులతో ఉన్న వ్యక్తిగత కక్షలతో ఈ హత్యలకు కారణం అని పోలీసులు నిర్ధారించారు. బాధితులపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆకాష్ కు అతని బంధువులకు మధ్య భూవివాదం ఉన్నట్లు అతని భార్య పోలీసులకు తెలిపింది. దాడి చేసిన వ్యక్తులను గుర్తించింది.