ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. తనతో శారీరకంగా కలవడానికి నిరాకరించిందని 37 ఏళ్ల మహిళను ఆమె స్నేహితుడు దారుణంగా హత్య చేశాడు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్ ఆలం, జర్నా అనే ఇద్దరు పుల్ పెహ్లాద్ పూర్లోని క్లాత్ ఎక్స్ పోర్టు కంపెనీలో పనిచేసేవారు. దాంతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అది కాస్తా బంధానికి తెరలేపింది. దాంతో వారిద్దరూ మరింత సన్నిహితులుగా మారారు. ఈ క్రమంలో చాంద్.. జర్నాకు ప్రతి నెలా రూ. 6 వేలు ఖర్చులకు ఇస్తున్నాడు. అయితే ఈ మధ్య జర్నా.. సూరజ్ అనే వ్యక్తితో స్నేహం చేస్తున్నట్లు ఆలంకు తెలిసింది. ఈ విషయంలో ఆలం.. జర్నాతో గొడవపడి ఆమెకు డబ్బులు ఇవ్వడం మానేశాడు. కొన్ని రోజుల తర్వాత.. నవంబర్ 21న బదర్పూర్ బస్ స్టాప్‌లో జర్నాను చాంద్ ఆలం కలుసుకున్నాడు. ఆమెను ఓఖ్లా తెహ్ఖండ్లోని రైల్వే ట్రాక్ సమీపంలోని పాడుబడిన క్వార్టర్‌కి తీసుకెళ్లాడు. అక్కడ బాధితురాలిని తనతో శారీరకంగా కలవాలని బలవంతం చేశాడు. అందుకు జర్నా ఒప్పుకోకపోవడంతో.. ఆమె బ్యాగ్‌లోని కత్తెరతో మెడపై పొడిచాడు. ఆమె మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్ తో కప్పి.. ఆమె ఫోన్‌ను రాయితో పగలగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ.. కత్తెరను, రక్తంతో తడిసిన బట్టలను నాలాలో పడేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. చాంద్ ను అదుపులోకి తీసుకున్నారు.
వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని కత్తెరతో..
- క్రైమ్
- November 23, 2021
లేటెస్ట్
- గుజరాత్లో ఎన్కోర్-ఆల్కమ్ప్లాంట్ప్రారంభం
- నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో స్పెషల్ పాలన
- స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి: ఎంపీ కొండా
- హైదరాబాద్మార్కెట్లోకి క్రెటా ఎలక్ట్రిక్కారు
- కోటక్ మహీంద్రా చేతికి స్టాండర్డ్‌చార్టర్డ్‌బ్యాంక్ లోన్లు
- ఢిల్లీ ప్రజలు షీలాదీక్షిత్ మోడల్ కోరుకుంటున్నారు :రాహుల్ గాంధీ
- క్రికెట్ బాల్స్‌తో గిన్నిస్ రికార్డు
- రేషన్‌కార్డుల కోసం ప్రత్యేక సాప్ట్వేర్ : మంత్రి పొన్నం ప్రభాకర్
- ఎల్ఐసీ నుంచి మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్
- కాంగ్రెస్ సభ్యత్వ నమోదుపై అవగాహన
Most Read News
- జ్యోతిష్యం : బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.. ఈ 5 రాశుల వారికి ఏ పని చేసినా విజయమే..!
- Good News : 2 పలుకుల కర్పూరం.. తమలపాకులో కలిపి తింటే.. 20 రోగాలు ఇట్టే తగ్గిపోతాయ్..!
- Good Health : ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్ ఇలా తయారు చేసుకుందాం.. హార్లిక్స్, బోర్నవిటా కంటే ఎంతో బలం..!
- ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ : పోచారంలో ఇన్ఫోసిస్ క్యాంపస్.. 17 వేల ఉద్యోగాలకు ఒప్పందం
- HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. మంచి జీతం.. ఉద్యోగం కొడితే లైఫ్ సెటిల్
- సైఫ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. కానీ అదేంటో బయటకు చెప్పను: ఆటో డ్రైవర్ రాణా
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు ప్రాజెక్టులకు పేర్లు మార్పు
- IT Raids: ప్రొడ్యూసర్ బాధలో ఉంటే సక్సెస్ మీట్ కరక్టేనా.. అనిల్, వెంకటేష్ స్పందన ఇదే!
- నెల తక్కువున్నా పర్లేదు.. అమెరికా పౌరసత్వం కోసం సిజేరియన్లు చేయమంటున్న భారత జంటలు
- Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు.. జైలు శిక్ష విధించిన ముంబై కోర్టు