పార్లమెంట్ దగ్గర నిప్పంటించుకున్నవ్యక్తి.. రెండు పేజీల సూసైడ్ నోట్

పార్లమెంట్ దగ్గర నిప్పంటించుకున్నవ్యక్తి.. రెండు పేజీల సూసైడ్ నోట్

పార్లమెంట్ దగ్గర ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది.  ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.  ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం ఆయన ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన జితేంద్రగా గుర్తించారు పోలీసులు.  అతడి శరీరం 90 శాతం కాలిపోయినట్లు తెలిపారు. అయితే ఘటనా స్థలంలో  డైరీ, రెండు పేజీల సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

డిసెంబర్ 25న  ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్‌కు చెందిన జితేంద్ర అనే వ్యక్తి రౌండ్‌ అబౌట్ రైలు భవన్‌లో నిప్పంటించుకున్నాడు. స్థానిక పోలీసులు,  రైల్వే పోలీసులు కొంతమంది పౌరులతో కలిసి వెంటనే మంటలను ఆర్పారు.  వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేశాం తదుపరి విచారణ కొనసాగుతోంది అని పోలీసులు తెలిపారు.
 

#WATCH | Delhi: DCP Devesh Kumar Mahla says, "Today a man named Jitendra, a resident of Baghpat in UP, tried to commit suicide at Rail Bhawan roundabout. The police constables along with some civilians immediately extinguished the fire. Investigation so far has revealed that he… https://t.co/zk5RAtUvft pic.twitter.com/oHDiAaXD2Z

— ANI (@ANI) December 25, 2024