ఢిల్లీలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. నిన్న (అక్టోబర్ 10) ఓ ఆటో డ్రైవర్ దోచుకుని చంపేసిన ఘటన మరువక ముందే మరో ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. బుధవారం ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో కారును దొంగిలించిన దొంగలు తప్పించుకునే ప్రయత్నంలో క్యాబ్ డ్రైవర్ ను ఢీకొట్టిచాలా దూరం ఈడ్చుకెళ్లారు. తాజాగా ముండ్కా ఏరియాలో పెట్రోల్ పంపులో దొంగతనం చోరీ చేశారు. క్యాషియర్ తలకు గన్ పెట్టి చంపుతామని బెదిరించి వేల రూపాయలు దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
మంగళవారం (అక్టోబర్10న)రాత్రి 10.30 ప్రాంతంలో ముండ్కా ఘేవ్రా మోడ్ పెట్రోల్ పంపు వద్ద ఈ ఘటన జరిగింది. బైక్ లపై వచ్చిన ఆరుగురు దుండగులు .. పెట్రోల్ నింమని బంక్ ఉద్యోగిని అడిగారు. పెట్రోల్ నింపుతుండగా బైక్ పై వెనక వ్యక్తి తుపాకీ తీసి ఉద్యోగికి గురిపెట్టి అతని దగ్గర ఉన్న నగదును దోచుకెళ్లారు.
చోరీ సమయంలో దుండగులు రెండు సార్లు కాల్పులు జరిపారు. దోచుకొని పారిపోయే సమయంలో బంక్ ఉద్యోగి బారీ కేడ్స్ అడ్డుపెట్టేందుకు ప్రయత్నించగా.. అతనిపై దుండగులు కాల్పులు జరిపారు.
दिल्ली - मुंडका पेट्रोल पंप पर बदमाशों ने फायरिंग कर की लूटपाट...
— AJIT SINGH Journalist ?? (@ajitsingh007417) October 12, 2023
बदमाशों को नहीं है पुलिस का खौफ... @dcpouter @DelhiPolice @CPDelhi @cp_delhi @LtGovDelhi pic.twitter.com/SBO5x0BwKK
दिल्ली : बाइक सवार 6 बेखौफ बदमाश पेट्रोल डलवाने के बहाने पंप पर पहुंचे। सेल्समैन को गन प्वाइंट पर लूटा, फायरिंग करके भागे। मुंडका इलाके की वारदात।
— Sachin Gupta (@SachinGuptaUP) October 12, 2023
कल इसी दिल्ली में कैब ड्राइवर की लूट के बाद हत्या करके लाश को डेढ़ KM कार से घसीटा गया था। pic.twitter.com/MV0hloKCjc