Video Viral: వామ్మో.. ఢిల్లీ మెట్రోలో చెప్పులతో కొట్టుకున్నారు

Video Viral: వామ్మో.. ఢిల్లీ మెట్రోలో చెప్పులతో కొట్టుకున్నారు

ఢిల్లీ మెట్రోలో ప్రయాణం టూరెస్ట్​ జర్నీగా మారిపోయింది.  రోజూ ఏదో ఒకరకంగా ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలుస్తుంది.  అసభ్యకర ప్రవర్తన, కొట్లాట, తిట్టుకోవడం, డ్యాన్స్ లు, రీల్స్ చేయడం వంటి అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. ఇలా ఏదో ఒక వీడియోతో తరచూ హాట్ టాపిక్‌గా మారుతున్న ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది.ఇప్పుడు  ఢిల్లీ మెట్రోలో ఓ ఇద్దరు ప్రయాణికులు  చెప్పులతో కొట్టుకున్న వీడియో వైరల్​ అవుతుంది.

 ఢిల్లీ మెట్రోలో ప్రయాణికులు కొట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. Ghar Ke Kalesh అనే ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​ చేయబడిన   వీడియోలో, ఇద్దరు ప్రయాణీకులు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. ముందుగా ఓ వ్యక్తి చెప్పులు తీసి మరో ప్రయాణికుడి ముఖంపై కొట్టడం, తర్వాత వ్యక్తి కూడా చెంపదెబ్బ కొట్టడం వీడియోలో చూడవచ్చు.


 మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మధ్య అకస్మాత్తుగా గొడవ ప్రారంభమైంది. చిన్నగా మొదలైన గొడవ కాస్త పెద్దదిగా మారింది. ఒకరి పై ఒకరు అరవడమే  కాదు చివరకు చెప్పులతో కూడా కొట్టుకున్నారు. చెంప దెబ్బలు, చెప్పులతో కొట్టుకోవడంతో మెట్రోలో ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ గొడవ చోటుచేసుకోవడంతో అక్కడే ఉన్న ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో వారిని ఆపకుండా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీస్తూ నెట్టింట పోస్ట్ చేశారు.

అయితే ఇంతలో, ఇద్దరి మధ్య గొడవను ఆపడానికి మరొక ప్రయాణికుడు జోక్యం చేసుకుంటాడు. ఇద్దరు ప్రయాణీకుల మధ్య గొడవకు కారణమేమిటో తెలియనప్పటికీ, ఈ వీడియో వైరల్ అవుతోంది. మెట్రో లోపల జరిగే ఇతర పోరాటాలతో పోల్చితే ఇది మామూలే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ ఢిల్లీ మెట్రోకు సంబంధించిన ఇలాంటి వీడియోలు సాధారణమే అని పేర్కొంటున్నారు. అయితే ఇలాంటి ఘటనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచిస్తున్నారు.