వివిధ రకాల వీడియోలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఢిల్లీ మెట్రో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా ఇద్దరు యువకులు మెట్రో కోచ్‌ను యుద్ధ క్షేత్రంగా మార్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.గతంలో ఢిల్లీ మెట్రోలో డ్యాన్సులు, అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు సహా ఇటీవల ఓ జంట మెట్రో కోచ్‌ను బెడ్ రూంగా మార్చిన వీడియోలు వైరల్ అయ్యాయి.
ఢిల్లీ మెట్రో వయలెంట్ లైన్ మార్గంలో ఈ ఘటన జరిగింది. మెట్రో రైలు రాజానహర్ సింగ్ (గతంలో బల్లభ్‌ఘర్ ) , కాశ్మీర్ గేట్ స్టేషన్‌ల మధ్య ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు. రద్దీగా ఉండే కోచ్ లో ఇద్దరు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరి ప్రయాణికుల మధ్య మాటా మాటి పెరగడంతో చేతులకు పనిచెప్పారు. ఒక వ్యక్తి మరో వ్యక్తిపై ముఖంపై బలంగా కొట్టాడు.
గతంలో కూడా...
ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. ఢిల్లీ మెట్రోలో ఒక జంట మరియు ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదాన్ని సంగ్రహించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ట్రాన్స్‌పోర్ట్‌లో కూర్చున్న ఇద్దరు మహిళలు యువ జంటను "సిగ్గులేనివారు" అని పిలవడం కనిపించింది, ఇది అబ్బాయిని మహిళలతో వాగ్వాదానికి దారితీసింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)గొడవలను పరిష్కరించడంలో ప్రయాణీకులం భద్రత విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.
DMRC మెట్రోలో ట్రైన్ లో ప్రయాణిచేటప్పుడు తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదని తెలిపింది. మెట్రోరైల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కి తెలపాలని మెట్రో సిబ్బందికి సూచించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించిన వారిపై ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చట్టంలోని సెక్షన్ 59 ప్రకారం శిక్షిస్తామని DMRC తెలిపింది.
ఇటువంటి ఘటనలు పెరిగితే ప్రజలు మెట్రోలో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపించకపోవచ్చు. ప్రభుత్వం ఇకనైనా సరైన చర్యలు తీసుకోకుంటే ప్రయాణికులకు మరిన్ని అవస్థలు తప్పవు. ప్రజలు మళ్లీ సొంత వాహనాల వినియోగిస్తే ఢిల్లీ కూడా అధిక ట్రాఫిక్ సమస్యలతో సతమతం కాక తప్పదు