ఈ చిలిపి పనులేంట్రా : అరే అది మెట్రో రైలురా.. పబ్ కాదు.

ఈ చిలిపి పనులేంట్రా : అరే అది మెట్రో రైలురా.. పబ్ కాదు.

రీల్స్ పిచ్చి రోజురోజుకు పెరిగిపోతోంది. రీల్స్ చేయడం కోసం యూత్ ఎలాంటి పనికైనా సిద్ధపడుతున్నారు. ఫేమస్ అయ్యేందుకు అది పబ్లిక్ ప్లేసా.. ప్రైవేట్ ప్లేసా అని తేడా లేకుండా రెచ్చిపోయి రీల్స్ చేస్తున్నారు. ఇక ఢిల్లీ మెట్రో రైల్లో రీల్స్ గురించి చెప్పుకుంటే గతంలో కంటే ఈ రీల్స్ ట్రెండ్ ఇప్పుడు మరీ పెరిగిపోయింది. డ్యాన్సులు, మోడలింగ్, విచిత్ర మైన డ్రెస్సింగ్, వింత చేష్టలతో యూత్ రెచ్చిపోయి ఢిల్లీమెట్రో రైలులో రీల్స్ చేయడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. వైరల్ గా మారడం..వాటిని చూసి తిట్టుకోవడం సాధారణమై పోయింది.  అయితే రీసెంట్ గా ఓ యువజంట రైలులో పబ్ గా ఊహించుకొని ఎంజాయ్ చేస్తూ రీల్స్ చేసిన వీడియాలో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ఓరేయ్ అది మెట్రో రైలురా.. పబ్ కాదురా అని ’’ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

ఈ వీడియోలో ఓ వ్యక్తి మోకాళ్లపై కూర్చొని తన పార్టినర్  నోటికి డ్రింగ్ అందిస్తూ కనిపిస్తాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తర్వాత ఒకరి నోటి నుంచి మరొకరి నోటికి డ్రింక్ ను ఉమ్మివేస్తూ చూసేవారు అసహ్యించుకునేలా డ్రింక్ ను షేర్ చేసుకుంటారు. ఈ వీడియోను మైక్రో బ్లాగింగ్ పోస్ట్ Xలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేం పోయే కాలం రా బాబు..  అని ఒకరంటే.. ‘‘అరే అది రైలురా .. పబ్ కాదు’’ అంటూ మరో నెటిజన్ చీవాట్లు పెట్టారు.  

Also Read :- మొలకలు రావాలంటే ఎలా చేయాలి

ఢిల్లీ మెట్రో వివాస్పదమైన రీల్స్ ఇది మొదటిసారి కాదు.. గతంలో ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే చర్యను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇదివరకే నిషేధించింది. ఇలాంటి చర్యలు మళ్లీ మళ్లీ జరగకుండా అనేక చర్యలు చేపట్టింది. అయినా ఢిల్లీ మెట్రోలో  రీల్స్ పిచ్చి ఆగడం లేదు.