రూ.350కోసం.. కత్తితో 100సార్లు పొడిచి.. డెడ్ బాడీ పక్కనే డ్యాన్స్

దేశ రాజధాని ఢిల్లీలోని వెల్‌కమ్ ఏరియాలో రూ.350 కోసం ఓ యువకుడు, మైనర్‌ ను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం ఈ హత్యకు దారి దోపిడీయే కారణమని పోలీసులు తెలిపారు. ఉన్మాది హత్య మొత్తం అక్కడి సీసీటీవీలో రికార్డయింది. మైనర్‌గా చెప్పబడుతున్న నిందితుడు మొదట 17 ఏళ్ల బాధితురాలిని గొంతు కోశాడని పోలీసులు తెలిపారు. బాధితుడు స్పృహ తప్పి పడిపోగా.. అతని వద్ద నుంచి రూ.350తీసుకుని, పలుమార్లు కత్తితో పొడిచాడు. అంతే కాదు అప్పటికే మద్యం మత్తులో ఉన్న నిందితుడు మృతదేహం పక్కన డ్యాన్స్ చేయడం కూడా అత్యంత ఆందోళనకరంగా కనిపించింది.

ఈ ఘటనలో బాధితుడిని GTB ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ ఫుటేజ్ పోస్ట్ కావడంతో.. ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది. అయితే ఈ సంఘటనలో అతను బాధితుడిని 100 సార్లు కత్తితో పొడిచాడని నివేదికలు చెబుతున్నాయి. హత్యాయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ : పార్టీ ఏదైనా అడిగిన వారి పనులు చేశా : నిరంజన్ రెడ్డి

నవంబర్ 22న రాత్రి 11.15 గంటలకు పీసీఆర్ కాల్ వచ్చిందిని, వెల్కమ్ ప్రాంతంలోని జంతా మజ్దూర్ కాలనీలో 18 సంవత్సరాల వయస్సు ఉన్న యువకుడిని దోచుకునే ప్రయత్నంలో మైనర్ కత్తితో పొడిచి చంపాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య ) జాయ్ టిర్కీ చెప్పారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.. కానీ అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారని అన్నారాయన. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని, ఆ ప్రాంతంలోని సీసీటీవీలను పరిశీలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.