పండుగల సీజన్ ప్రారంభం కావడంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవ స్థితికి చేరుకుంది. జాతీయ రాజధానిలో 24 గంటల సగటు వాయు నాణ్యత సూచిక (AQI) ముందు రోజు కంటే కొంచెం మెరుగ్గా ఉదయం 309 పాయింట్ల వద్ద ఉంది. ఈరోజు ఉదయం ఢిల్లీలోని దాదాపు అన్ని ప్రాంతాలు చాలా పేలవమైన స్థితిలో ఉన్న గాలి నాణ్యతను నమోదు చేశాయి, అత్యల్పంగా వజీర్‌పూర్ ప్రాంతంలో AQI 436 వద్ద ఉంది. గాలి పీల్చడానికి ప్రమాదకరంగా మారింది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం, జాతీయ రాజధాని ప్రాంతంలోని ప్రాంతాలు కూడా అత్యంత దారుణమైన గాలి నాణ్యతను నమోదు చేశాయి. ఫరీదాబాద్ లో AQI 346, గురుగ్రామ్ లో 26f8, నోయిడాలో 312గా నమోదైంది.
Also Read :- రష్యా యూట్యూబర్‌కు వేధింపులు
మే నుంచి అత్యల్పంగా..
మే 17 తర్వాత ఈ సీజన్‌లో మొదటిసారిగా ఢిల్లీలో గాలి నాణ్యత AQI 313కి పడిపోయింది. భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపిన ప్రకారం, ఉష్ణోగ్రతల్లో తగ్గుదల, దహనం, ఉద్గారాల ప్రవాహం కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్ లో గాలి నాణ్యత రాబోయే కొద్ది రోజులు చాలా పేలవంగా ఉంటుంది. గాలి వేగం తక్కువగా ఉందని, గత రెండేళ్లుగా కాకుండా అక్టోబర్‌లో తక్కువ వర్షపాతం నమోదవుతోందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.