న్యూఢిల్లీ: ఇండ్ల ధరలు ఎక్కువగా పెరిగిన సిటీల్లో గ్లోబల్‌గా ముంబై రెండో ప్లేస్ దక్కించుకుందని, ఢిల్లీ మూడో ప్లేస్‌లో ఉందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కంపెనీ నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ – జూన్ క్వార్టర్‌కు గాను, గ్లోబల్‌గా 44 సిటీలను పరిశీలించి ఈ లిస్ట్‌ను తయారు చేసింది.
గ్లోబల్‌గా 44 సిటీల్లో ఇండ్ల ధరలు సగటున 2.6 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగాయని, అంతకు ముందు క్వార్టర్‌లో 4.1 శాతం పెరిగాయని నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ వివరించింది. మనీలా (ఫిలిప్పీన్స్) మొదటి ప్లేస్‌లో నిలిచింది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో ఈ సిటీలో ఇండ్ల ధరలు ఏడాది ప్రాతిపదికన 26 శాతం పెరిగాయి. ముంబైలో ఇండ్ల రేట్లు 13 శాతం పెరగగా, న్యూఢిల్లీలో 10.6 శాతం పెరిగాయి. బెంగళూరులో 3.7 శాతం పెరిగాయి. ఈ సిటీ తాజా ర్యాంకింగ్స్‌లో 15 వ ప్లేస్‌లో ఉంది. గ్లోబల్ సిటీలలో లాస్ ఏంజెలస్ 4 వ ప్లేస్‌లో, మయామి, నైరోబి, మాడ్రిడ్, లిస్బన్, సియోల్, శాన్ ఫ్రాన్సిస్కో ఆ తర్వాత ప్లేస్‌లలో ఉన్నాయి. మరోవైపు వియన్నా, బ్యాంకాంక్, వెల్లింగ్టన్‌లలో ఇండ్ల ధరలు తగ్గాయి.