
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని కర్ణాటక సరిహద్దులో ఢిల్లీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నం పోర్టు నుంచి ముంబైకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే అనుమానంతో రవాణా శాఖ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను ఆపి తనిఖీ చేశారు. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న ఒక వాహనాన్ని నిలిపివేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై వివరాలు చెప్పేందుకు ఢిల్లీ పోలీసులు నిరాకరించారు.