Delhi Premier League 2024: ఆగష్టు 17 నుంచి ఢిల్లీ ప్రీమియర్ లీగ్.. బరిలో భారత క్రికెటర్లు

Delhi Premier League 2024: ఆగష్టు 17 నుంచి ఢిల్లీ ప్రీమియర్ లీగ్.. బరిలో భారత క్రికెటర్లు

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL 2024) శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) షెడ్యూల్‌ ప్రకటించింది. టోర్నీ తొలి ఎడిషన్‌లో ఆరు పురుషుల జట్లు, నాలుగు మహిళల జట్లు తలపడనున్నాయి. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, వెటరన్ బౌలర్ ఇషాంత్ శర్మ, మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్, పేసర్ నవదీప్ సైన్ వంటి భారత క్రికెటర్లు ఈ టోర్నీలో కనిపించనున్నారు. 

ఆరు జట్ల తలపడుతున్న ఈ టోర్నీలో జరిగే ఫైనల్‌ సహా 33 మ్యాచ్‌లు ఉంటాయి. అన్ని మ్యాచ్‌లు అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్నాయి. ఫైనల్‌ మ్యాచ్ సెప్టెంబర్ 8న జరగనుంది. శ్రీలంక పర్యటన అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న రిషబ్ పంత్.. ఈ టోర్నీలో ఆరంభ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. శనివారం జరిగే ప్రారంభ మ్యాచ్‌లో పురాణి డిల్లీ జట్టు తరుపున రిషబ్ పంత్, ఇషాంత్ శర్మలు ఆడనున్నట్లు సమాచారం. ప్రారంభ మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. 

పాల్గొనే జట్లు:

  • పురాణి డిల్లీ
  • సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్
  • ఈస్ట్ ఢిల్లీ రైడర్స్
  • సెంట్రల్ ఢిల్లీ కింగ్స్
  • నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్
  • వెస్ట్ ఢిల్లీ లయన్స్

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు:

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్‌లు స్పోర్ట్స్ 18 (2) టీవీ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. డిజిటల్ గా చూడాలనుకుంటే, JioCinema యాప్, వెబ్‌సైట్‌లో ఉచితంగా వీక్షించవచ్చు.