
న్యూఢిల్లీ: ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన యంగ్ క్రికెటర్‌ఆయుష్ బదోనీ, మరో కుర్రాడు ప్రియాన్ష్‌ఆర్య ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో సిక్సర్ల మోత మోగించారు. సౌత్ ఢిల్లీకి ఆడుతున్న బదోనీ టీ20 మ్యాచ్‌లో అత్యధికంగా 19 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించగా.. ఆర్య ఆరు బాల్స్‌కు ఆరు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో బదోనీ ( 55 బాల్స్‌లో19 సిక్సర్లు, 8 ఫోర్లతో 165), ఆర్య (50 బాల్స్‌లో 10 సిక్సర్లు, 10 ఫోర్లతో 120) మెరుపు సెంచరీలతో రెండో వికెట్‌కు 286 రన్స్ జోడించాడు. టీ20ల్లో ఏ వికెట్‌కైనా ఇదే హయ్యెస్ట్ పార్ట్‌నర్‌షిప్. వీళ్ల జోరుకు 308/5 స్కోరు చేసిన సౌత్ ఢిల్లీ 112 రన్స్ తేడాతో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌ను చిత్తు చేసింది.