ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా

ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటన బాధితులకు కేంద్రం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.   తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష సాయం కూడా ప్రకటించింది.మరో వైపు ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది కేంద్రం.

ఢిల్లీ రైల్వే స్టేషన్లో  ఫిబ్రవరి 15 రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా..మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 11  మంది మహిళలు, నలుగురు చిన్నారులు,నలుగురు పురుషులు ఉన్నారు.  కుంభమేళాకు వెళ్తున్న భక్తులు రైల్వే స్టేషన్ కు పోటెత్తడంతో 14,15 ఫ్లాట్ ఫామ్ లదగ్గర తొక్కిసలాట జరిగింది. ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్న రైల్లు రద్దయ్యాయనే వదంతులతో జనం ఒక్కసారిగా గందరగోళానికి గురవ్వడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

తొక్కిసలాట ఘటనపై ప్రదాని మోదీ,రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు.   ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యామని తెలిపారు.  . గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు.