దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తగ్గింది. జూలై మొదటి వారం మొత్తం సంతృప్తి కరమైన గాలి నాణ్యత నమోదు అయింది. ఈ ఏడాది మొత్తంలో అతి తక్కువ AQI 56 రికార్డయింది.
జూన్ లో ఏడు రోజుుల పాటు AQI(వాయువ్య నాణ్యత సూచిక) 100 కంటే తక్కువగా నమోదు అయింది. జూలైలో వాతావరణం మార్పులు, భారీ వర్షాల కారణంగా మరింత మెరుగు పడింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివరాల ప్రకారం.. ఆదివారం (జూలై 8) సాయంత్రం 6 గంటలకు 56 రీడింగ్ తో AQI సంతృప్తికరమైన కేటగిరిలో నమోదు అయింది. AQI జూలై 1-7 మధ్య అతి తక్కువ కేటగిరిలో ఉంది. ఆదివారం ఇంకా అత్యల్పంగా నమోదు అయింది.
సున్నా నుంచి 50 మధ్య AQI మంచిది.51 నుంచి 100 ఉంటే సంతృప్తికరం. 101 నుంచి 200 నార్మల్, 201నుంచి 300 లోపు నమోదు అయితే గాలి నాణ్యత క్షీణిస్తుందని అర్థం. ఇక 301 నుంచి 400 లోపు నమోదు అయితే ప్రమాదంలో ఉందని, 400నుంచి 500 లోపు నమోదు అయితే ప్రమాదకర స్థాయి దాటిందని పరిగణించబడుతుంది.
భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఆదివారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35.8 ఢిగ్రీల సెల్సియస్ గా నమోదు అయింది. ఇది సీజన్ సగటు కంటే0.8 నాచ్ తక్కువ. కని ష్ఠ ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయింది. ఇది సీజన్ సగటు కంటే రెండు నాచులు తక్కువగా ఉందని ఐఎండీ తెలిపింది.