
ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9197 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 13510 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కోవిడ్ బారిన పడి 24 మంది చనిపోయారు. ప్రస్తుతం ఢిల్లీలో 54,246 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 13.32 శాతంగా ఉంది. అయితే ఢిల్లీలో కోవిడ్ పాజిటివిటీ రేటు నిన్న 16.3 శాతం ఉంటే.. ఇవాల 13.3 శాతానికి పడిపోయింది. కరోనా కేసులు కూడా 19% తగ్గాయి.
మరోవైపు భారత్ లో ఒమిక్రాన్ వ్యాప్తికి సంబంధించి ఇండియన్ సార్స్ కోవ్ 2 జెనోమిక్ కన్సార్టియం (ఇన్సాకాగ్) కీలక ప్రకటన చేసింది. దేశంలో ఈ వేరియెంట్ సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని తెలిపింది. ఆ కారణంగానే ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో ఒమిక్రాన్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని వెల్లడించింది.
ఒమిక్రాన్ వ్యాప్తి విదేశీ ప్రయాణికుల నుంచి కన్నా దేశీయంగానే ఎక్కువగా జరుగుతోందని ఇన్సాకాగ్ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికుల్లో తొలుత ఈ వేరియెంట్ ను గుర్తించినట్లు చెప్పింది. ఒమిక్రాన్ సోకిన వారిలో చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనపడటం లేదని ఇన్సాకాగ్ వెల్లడించింది. కొందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనపడుతున్నాయని చెప్పింది. ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తున్నప్పటికీ హాస్పిటల్ లో చేరాల్సిన అవసరం తక్కువగానే ఉంటోందని అయినా ఈ వేరియెంట్ ను నిర్లక్ష్యం చేయకుండా అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరింది.
Delhi reports 9,197 new #COVID19 cases, 13,510 recoveries and 34 deaths in the last 24 hours.
— ANI (@ANI) January 23, 2022
Active cases 54,246
Positivity rate 13.32% pic.twitter.com/Mi0kc7nAF1