ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన కవిత ములాఖత్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. తల్లి శోభను,పిల్లలను చూడాలంటూ కవిత ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన కోర్టు.. కస్టడీలో ఉన్న ఏడు రోజులు ప్రతిరోజు సాయంత్రం6 గంటల నుంచి 7గంటల వరకు చూసేందుకు అనుమతిచ్చింది. కవితను కలిసేందుకు 8 మందికి అనుమతిచ్చింది కోర్టు. ఇవాళ నలుగురు, రేపు నలుగురు కలిసేందుకు పర్మిషన్ ఇచ్చింది. ముందుగా పర్మిషన్ తీసుకున్న వాళ్లనే అనుమతిస్తామని.. ఎక్కువ మంది వస్తే అనుమతించబోమని కోర్టు ఆదేశించింది.
కవిత అరెస్టయినప్పటి నుంచి ఆమె కుటుంబ సభ్యులు ఢిల్లీలోనే ఉంటున్నారు. కేటీఆర్, హరీశ్ రావు మార్చి 16న సాయంత్రం కవితను కలిసి పలు విషయాలపై చర్చించారు
ALSO READ :- Ustaad Bhagath singh: గుర్తుపెట్టుకో.. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. అదిరిపోయిన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్
మార్చి 15న అరెస్టయిన కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. మార్చి 23 వరకు కవిత కస్టడీలోనే ఉండనున్నారు. లిక్కర్ స్కాం కేసులో ఆప్ నేతలకు కవిత రూ. 100 కోట్లు చెల్లించారని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో వైపు తిహార్ జైల్లో కలుద్దామంటూ ఈ కేసులో నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ కవితకు లేఖ రాశాడు. సినిమా క్లైమాక్స్ చేరుకుందని..కేజ్రీవాల్ ను సైతం వదిలిపెట్టొద్దంటూ లేఖలో తెలిపాడు.