లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత ధాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది.
అయితే ఇప్పటికే ఆమె కుమారుడికి ఏడు పరీక్షలు పూర్తి అయ్యాయని, బెయిల్ ఇవ్వవద్దని కోర్టును ఈడీ కోరింది. పైగా బెయిల్ ఇస్తే కవిత సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ కోర్టును కోరింది.
ఫిబ్రవరి 15న కవితను ఈడీ అరెస్ట్ చేయగా.. మార్చి 26 నుంచి తీహార్ జైలులో ఉంటున్నారు. కవితకు కోర్టు విధించిన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఇవాళ కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో.. రేపు (మంగళవారం) మళ్లీ తీహార్ జైలు నుంచి కోర్టు ముందు హాజరుపరుస్తారు. కాగా రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ విచారణ ఏప్రిల్ 20న జరగనుంది.