వావ్: స్టూడెంట్ తో కలిసి టీచర్ స్టెప్పులు

ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో స్టూడెంట్ తో కలిసి డ్యాన్స్ చేసింది ఓ టీచర్. క్లాస్ రూంలో ఓ స్టూడెంట్ ముందుకు వచ్చి... హర్యానీ పాటకు డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఇంతలో పక్కనే ఉన్న టీచర్ మను గులాటీ.. స్టూడెంట్ తో కలిసి కొన్ని స్టెప్పులేశారు. స్టూడెంట్ ని ఇమిటేట్ చేస్తూ.. బ్యూటిఫుల్ గా డ్యాన్స్ చేశారు. స్టూడెంట్ తో కలిసి టీచర్ డ్యాన్సు చేయడంతో.. క్లాస్ లోని మిగతా వారు క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేశారు. ఈ వీడియోని... టీచర్ మను గులాటి ట్విట్టర్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.