దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు (Delhi Schools) మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపుతున్నాయి. నగరంలోని ఏకంగా 40 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సోమవారం ( డిసెంబర్ 9) ఉదయం ఢిల్లీలోని 40 పాఠశాలలకు ఈ-మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్‌కె పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ్ విహార్‌లోని జిడి గోయెంకా స్కూల్, మయూర్‌విహార్‌లోని మదర్ మేరీస్ స్కూల్, బ్రిటిష్ స్కూల్, సాల్వాన్ స్కూల్, మోడరన్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్, డిఎవి స్కూల్ పాఠశాలలకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో భయాందోళనకు గురైన స్కూల్స్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించి విద్యార్థులను వారి ఇళ్లకు పంపించారు.
Also Read:-రైతులపైకి మళ్లీ టియర్‌గ్యాస్.. 8 మందికి గాయాలు.. శంభు బార్డర్ వద్ద ఉద్రికత్త
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ రెండు పాఠశాలల ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. ఇప్పటివరకు ఎటువంటి అభ్యంతరకరమైన వస్తువు కనిపించలేదు. దీంతో వచ్చిన ఈ మెయిల్ ఫేక్ అని భావిస్తున్న పోలీసులు.. ఎవరు పంపించారు? అనే దానిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇమెయిల్ పంపిన వారిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి
అయితే డబ్బు కోసం బాంబు బెదిరింపు మెయిల్స్ పంపినట్టు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. బాంబులు చాలా చిన్నవని, ఎవరూ గుర్తించలేని ప్రదేశాల్లో అమర్చామని పేర్కొన్న ఆగంతకులు.. వాటిని నిర్వీర్యం చేయాలంటే 30 వేల డాలర్లు కావాలని డిమాండ్ చేశారు. మేము పెట్టిన బాంబుల వల్ల భవనాలకు పెద్దగా నష్టం జరగదు.. కానీ, అవి పేలితే చాలా మందికి గాయాలవుతాయి.. అవయవాలను కోల్పోకతప్పదు అని హెచ్చరించారు.
#WATCH | Delhi | Visuals from outside of GD Goenka Public school, Paschim Vihar - one of the two schools that received bomb threats, via e-mail, today morning pic.twitter.com/XoIBJoVsVt
— ANI (@ANI) December 9, 2024