Delhi Elections:ఢిల్లీ పీఠం బీజేపీదే..ఎగ్జిట్ పోల్ సర్వేలు

Delhi Elections:ఢిల్లీ పీఠం బీజేపీదే..ఎగ్జిట్ పోల్ సర్వేలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్  ముగిసింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఎంత శాతం ఓటింగ్ వస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తమ అంచనాలను విడుదల చేశాయి.ఎక్కువ శాతం ఢిల్లీ ప్రజలు  బీజేపీకి ఓట్లు వేశారని, ఎక్కువ సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్  అంచనా వేశాయి. 

పీపుల్స్ పల్స్: ఆప్‌: 10-19, బీజేపీ: 51-60, కాంగ్రెస్‌ 0

మాట్రిజ్‌: ఆప్‌: 32-37, బీజేపీ: 35-40, కాంగ్రెస్‌ 0-1
పీపుల్స్‌ ఇన్‌సైట్‌: ఆప్‌: 25-29, బీజేపీ: 40-44, కాంగ్రెస్‌ 0-1

చాణక్య స్ట్రాటజిక్ : ఆప్‌: 25-28, బీజేపీ: 39-44, కాంగ్రెస్‌ 02 03
పి-మార్క్ : ఆప్ 21-31, బీజేపీ 39-49, కాంగ్రెస్ 0-1

జేవీసీ: ఆప్ 22-31, బీజేపీ 39-45, కాంగ్రెస్ 0-2
పోల్ డైరీ: ఆప్ 18-25, బీజేపీ 42-50, కాంగ్రెస్ 0-2

అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఉన్న కేకే సర్వే మాత్రం.. అందుకు భిన్నంగా తన ఎగ్జిట్ పోల్ సర్వేను వెల్లడించింది. ఢిల్లీలో గెలిచేది ఆమ్ ఆద్మీ పార్టీ.. ఆప్ అంటూ తన రిపోర్ట్ విడుదల చేసింది. 

70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ 44 సీట్లు, బీజేపీ 26 సీట్లు గెలుస్తుందని స్పష్టం చేసింది కేకే సర్వే. ఢిల్లీ రాష్ట్రంలో 10 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్ల సంఖ్య ఎక్కువ అని.. ఆ 10 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో ఆప్ పార్టీదే విజయం అని స్పష్టం చేసింది కేకే సర్వే.