ఏం గుండెరా వీడిది.. పరీక్షలో అన్ని ప్రశ్నలకు ధోని పేరే సమాధానం

ఏం గుండెరా వీడిది.. పరీక్షలో అన్ని ప్రశ్నలకు ధోని పేరే సమాధానం

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే ఎంతోమంది ఫ్యాన్స్ మహేంద్రుడి మీద రకరకాలుగా వారి అభిమానం చూపిస్తారు. కొందరు ధోనీ జెర్సీ వేసుకోవడం.. మరి కొందరు పాలాభిషేకం చేయడం.. ఇంకొందరైతే అభిమానం మరీ ఎక్కువై కాళ్ళ మీద పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. బడా హీరోలు, స్టార్ క్రికెటర్ల విషయంలో ఇలాంటివి జరగటం సహజంగానే చూస్తూ ఉంటాం. అయితే ఒక ఒక స్కూల్ కుర్రాడు మాత్రం ధోనీపై ప్రేమను విచిత్రంగా చాటుకున్నాడు. 

గణిత పరీక్షలో ప్రతి సమాధానానికి "తలా" అని రాసి మాహీ అంటే ఎంత ఇష్టమో తెలియజేశాడు. "తల" అనేది ఒక నాయకుడిని గౌరవించే తమిళ పదం. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజయవంతంగా నడుపుతున్న ధోనీని అభిమానులు ముద్దుగా తలా అని పిలుచుకుంటారు. ఇందుకుగాను ఢిల్లీ పాఠశాల ఈ స్టూడెంట్ ను సస్పెండ్ చేశారు. ఈ స్టూడెంట్ పేరు గజోధర్‌. ఇతడు MS ధోనీకి వీరాభిమాని. ఒక స్కూల్ కుర్రాడికి ఈ రేంజ్ లో అభిమానం ఉండడంతో ధోనీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుంటే.. మిగిలిన వారు ఇదెక్కడి పిచ్చి అని కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ ఏడాది(2023) ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ పై గెలిచి అయిదవ సారి ట్రోఫీని గెలుచుకుంది. ధోనీ విషయానికి వస్తే 2024 ఐపీఎల్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. మోకాలి గాయంతో మహీ 2024 ఐపీఎల్ ఆడతాడా లేదా అనే అనుమానం అభిమానుల్లో కలిగినా చెన్నై ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.