జేఈఈ పాస్ కాలేమోనని భయంతో.. బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

జేఈఈ పాస్ కాలేమోనని భయంతో.. బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

చదువు ఒత్తిడి విద్యార్థిని ప్రాణాలు తీసింది. ఇంటర్ పూర్తి చేసి  ఇంజనీరింగ్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్..జేఈఈ ఉత్తీర్ణత సాధించలేదని భవనం పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. శనివారం ( అక్టోబర్ 26) ఉదయం 11.45 గంటల సమయంలో న్యూఢిల్లీలోని జామియా నగర్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలిక తాను నివాసం ఉంటున్న భవనం ఏడో అంతస్తునుంచి దూకింది.  

12వ తరగతి పూర్తి చసి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు సిద్దమవుతున్న బాలిక ఉత్తీర్ణత సాధించలేను అని భయంతో బలవన్మరణానికి పాల్పడింది.‘‘ నన్ను క్షమించండి.. నేను జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేని అని’’ రాసినసూసైడ్ నోట్ ఘటనలో స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదువు ఒత్తిడి, అంచనాలను అందులేకపోవడమే కారణమని ఆమె సూసైడ్ నోట్ రాసిందని పోలీసులు తెలిపారు. 

ALSO READ | శ్రీనగర్‌లో ఆర్మీ ట్రక్‌ లోయలో పడి.. ప్రాణాలు కోల్పొయిన జవాన్

బాలిక భవనం  ఏడో అంతస్తునుంచి దూకుతున్న సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అింది. భారతీయ సురక్షా సంహిత లోని సెక్షన్ 194 కింద విచారణ జరుగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.