
లౌడ్ స్పీకర్ల వాడకంపై ఢిల్లీలో కొత్త రూల్స్..అనుమతించిన దానికంటే ఎక్కువ శబ్దం వినిపించిందా జరిమానాల బ్యాండ్ మోగిపోద్ది. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో అమలులోకి వచ్చిన చర్యల మాదిరిగానే దేశ రాజధాని ఢిల్లీలో కూడా లౌడ్ స్పీకర్లు వినియోగంపై కొత్త రూల్స్ తీసుకొచ్చారు. రూల్స్ అతిక్రమిస్తే భారీ మొత్తం జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఢిల్లీ అంతటా లౌడ్ స్పీకర్లు, పబ్లిక్ మీటింగుల వద్ద మైకుల వినియోగంపై పోలీసులు కొత్త రూల్స్ జారీ చేశారు. ధ్వని కాలుష్యం తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. పబ్లిక్ మీటింగులు, ర్యాలీలు, మతపరమైన ప్రదేశాలలో అనుమతించబడిన వ్యాల్యూమ్ స్థాయిలను మించి లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదని, రూల్స్ అతిక్రమిస్తే రూ. లక్ష వరకు జరిమానా విధించనున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. బహిరంగ సభలు, మతపరమైన కార్యక్రమాలు ,ర్యాలీలు సహా ఏ ప్రదేశంలోనైనా లౌడ్ స్పీకర్లను ఉపయోగించాలంటే పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు.
సౌండ్ లిమిట్స్..
బహిరంగ ప్రదేశాల్లో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లను లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లను ఉపయోగించడం ఖచ్చితంగా నిషేధించారు.
బహిరంగ ప్రదేశాలలో ధ్వని స్థాయి పరిసర శబ్ద స్థాయిల కంటే 10 డెసిబుల్స్ (dB(A)) మించకూడదు.
ప్రైవేట్ యాజమాన్యంలోని సౌండ్ సిస్టమ్‌లలకు పరిసర స్థాయిల కంటే 5 dB(A) కి లిమిట్స్ విధించారు.
పారిశ్రామిక ప్రాంతాలు: 75 dB / 70 dB
నివాస ప్రాంతాలు: 55 dB / 45 dB
ఆసుపత్రులు, కోర్టులు, పాఠశాలలు మొదలైన వాటి దగ్గర 50 dB / 40 dB కంటే ఎక్కువగా ఉండకూడదు.
రూల్స్ అతిక్రమిస్తే..
అనుతి లేకుండా లౌడ్ స్పీకర్లనువాడితే: రూ. 10వేల జరిమానా ,పరికరాలను స్వాధీనం చేసుకుంటారు.
జనరేటర్ సెట్లు (DG సెట్లు): 1000 KVA పైన ఉంటే రూ. 1లక్ష ఫైన్
62.5 నుంచి 1000 KVA మధ్య ఉంటే రూ. 25వేలు
62.5 KVA వరకు ఉంటే రూ. 10వేల జరిమానా
మతపరమైన కార్యక్రమాలు, వివాహాలు ,ర్యాలీలు..
మతపరమైన వేడుకలు, వివాహ కార్యక్రమాలు లేదా ర్యాలీల సమయంలో రూల్స్ అతిక్రమించి నివాస ప్రాంతాల మధ్య డీజేలు పెడితే రూ. 10వేలు, ఆస్పత్రులు, కోర్టులు, స్కూళ్ల దగ్గర లౌడ్ స్పీకర్లు పెడితే రూ.20వేల జరిమానా విధిస్తారు.
►ALSO READ | Vice President: సుప్రీంకోర్టు ఉత్తర్వులపై ఉపరాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు..‘రాష్ట్రపతిని ఎవరూ నిర్దేశించలేరు’
వేడుకలు, మతపరమైన ఆచారాలను పరిమితం చేయడం లక్ష్యం కాదు.. విద్యార్థులు, రోగులు ,వృద్ధుల వంటి వారికి ఇబ్బంది కలగకుండా బాధ్యతాయుతంగా వ్వవహరించాలనే లక్ష్యంతో ఉన్నామని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.