దేశరాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు, ఎయిర్ పొల్యూషన్ కప్పేసింది. ఢిల్లీలో తీవ్రమైన చలిగాలులతో పలుచోట్ల టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయి. సరైన వెలుతురులేకపోవటంతో...న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ లో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు ఎఫెక్ట్ తో.. కొన్నిరైళ్లను రద్దు చేశారు.
పొగమంచుతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పలు ప్లైట్ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. రాజధానిలో రెడ్ పోర్ట్, కన్నట్ ప్లేస్, అక్షర్ ధామ్, ఢిల్లీగేట్ ఏరియాలో చలి పంజా విసురుతోంది. అవసరం ఉంటే తప్ప ఢిల్లీవాసులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. మరొకొన్నిచోట్ల పడిపోతున్న టెంపరేచర్లతో ఉపశమనం కోసం చలిమంటలు కాచుకుంటున్నారు.