- బాలగోపాల్ స్మారకోపన్యాసంలో ఢిల్లీ వర్సిటీ ఫ్రొఫెసర్ అచిన్ వనాయక్..
ముషీరాబాద్, వెలుగు: గాజాలో ఇజ్రాయిల్ మారణహెూమాన్ని సృష్టిస్తోందని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అచిన్ వనాయక్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మానవ హక్కుల నేత ప్రొఫెసర్బాలగోపాల్ 15వ స్మారక లెక్చర్ ప్రోగ్రాంకు ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు.
గాజా జనాభాలో 8 శాతం మంది యుద్ధం వల్ల నష్టపోయారని కొందరు మరణిస్తే, మరికొందరు ఆచూకీ లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ఉద్య మాలను గుర్తించడంలో విచిత్ర పరిస్థితి అనే అంశంపై హక్కుల కార్యకర్త తాషి చౌడుప్ ప్రసంగించారు.
మానవ హక్కుల వేదిక నాయకులు బాలగోపాల్ ఉద్యమ నేపథ్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామిక ధృక్పథం, స్త్రీల కోసం..-బతుకు కోసం, సిటిజన్ రిపోర్ట్ ఆన్సెక్యూరిటీ- పుస్తకాలను ఆవిష్కరించారు.
ప్రొఫెసర్ హరగోపాల్, పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు రాఘవచారి, సీనియర్ సంపాదకులు రామచంద్ర మూర్తి, వసంత కన్నాభిరన్, తిరుపతయ్య, ప్రొఫె సర్లు నరసింహా రెడ్డి, లక్ష్మీనారాయణ, లలితా రాందాస్, వేమన వసంత లక్ష్మి, ఎస్. జీవన్ కుమార్, చంద్రశేఖర్, వీఎస్ కృష్ణ, యూజీ శ్రీనివాసులు, డాక్టర్ ఎస్. తిరుపతయ్య, ఆత్రం భుజంగ రావు వై. రాజేశ్పాల్గొన్నారు.