ఢిల్లీకి నీళ్లివ్వండి.. హిమాచల్, హర్యానాకు  సుప్రీంకోర్టు ఆదేశం 

ఢిల్లీకి నీళ్లివ్వండి.. హిమాచల్, హర్యానాకు  సుప్రీంకోర్టు ఆదేశం 

ఢిల్లీకి అదనపు నీటిని అందించాలని హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలని గురువారం (జూన్6)న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీకి హిమాచల్ ప్రదేశ్ ఇస్తున్న నీటి వివరాలను కోర్టుకు ఇవ్వాలని ఎగువ యమునా నది బోర్డు ను ఆదేశించింది. మరోవైపు నీరు వృధా కాకుండా చేరసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది.

ఢిల్లీలో నీటి సమస్య మరింత తీవ్రమైంది. తాగు నీటి కోసం మూడు, నాలుగు నెలలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. సంజయ్ క్యాంప్ సహా  చాలా కాలనీలు,  బస్తీల్లో నీటి కరువు నెలకొంది. తాగునీటి కోసం  వాటర్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ట్యాంకర్లు రాగానే దాని వెంట ఉరుకులు, పరుగులు పెడుతున్నారు ప్రజలు. ఎండాకాలం ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు అడుగంటడం కూడా నీటి కరువుకు ప్రధాన కారణమైంది.

ట్యాంకర్లు వచ్చినా...అవి సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. తాగు నీటి  కోసం తాము, తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని కోరుతున్నారు. తక్షణమే  తమకు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రజలు.