దేశ రాజధానిలో నీటి సంక్షోభం ఎలా ఉందో ఈ ఫొటో చూస్తే అర్థమౌతుంది. వాటర్ క్యాన్‌లను ఛైన్ లతో బంధించారు. నీటి కొరత వల్లే వాళ్లు ఇలా చేయాల్సి వస్తోంది. ఎవరైనా నీళ్లను దొంగిలిస్తే ఎలా అని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీవితంలో నీళ్లు ఎంతటి కీలక పాత్ర పోషిస్తాయో అందరికీ తెలుసు. నీళ్లు లేనిదే ఏ పనిచేయలేము. కానీ..నీరు దొరక్క ఢిల్లీలోని పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈసారి ఎండలతో నీటి కొరత తీవ్రంగా ఏర్పడింది. నీటి సరఫరా విషయంలో అంతరాయం ఏర్పడనుందని ఢిల్లీ జల్ బోర్డు (DJB) వెల్లడించింది. దీంతో ప్రజలు భయపడిపోయారు.
యమునా నది దాదాపు ఎండిపోయిన పరిస్థితిలో ఉంది. వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లా వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లలో ఉత్పత్తి సామర్థ్యం మరింత దిగజారడంతో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఢిల్లీ జల్ బోర్డు పేర్కొంది. దీంతో ఏమి చేయాలో ప్రజలకు అర్థం కాలేక నిస్సహాయస్థితిలో ఉండిపోయారు. వజీరాబాద్ వాటర్ వర్క్స్ వద్దనున్న యమునా మట్టం సాధారణ స్థాయి 674.50 అడుగులు ఉంటే.. 669.40 అడుగులకు చేరింది. సివిల్ లైన్స్, హిందూరావు ఆసుపత్రి, కమలానగర్, శక్తినగర్, కరోల్ బాగ్, పహర్ గంజ్, NDMC ప్రాంతాలు,కల్కాజీ, గోవింద్ పురి, తుగ్లకాబాద్, సంగం విహార్, రాంలీలాల వంటి ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో నీరు రాదని ఉద్దేశ్యంతో ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలని ప్రజలు భావించారు.
#WATCH | Delhi: People chain their water cans as they collect water from water tanks as well as water bore amid a deepening water crisis in parts of the national capital.
— ANI (@ANI) May 17, 2022
Visuals from Kusumpur Pahari, Vasant Vihar. pic.twitter.com/XVorfIvJ3N
మరిన్ని వార్తల కోసం : -
పరుపు కోసం ఏనుగు - జూ కీపర్ మధ్య పోరు, ఎవరు గెలిచారు ?
5జీ రాకతో అభివృద్ధిలో వేగం పెరుగుతుంది