న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని నీటికొరత వేధిస్తున్నది. యమునా నదిలో అమ్మోనియా సాంద్రత పెరగడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. నవంబర్ 1 వరకు ఉత్తర, ఈశాన్య, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలోని ప్రాంతాలకు సమస్య ఉంటుందని ఢిల్లీ జల్ బోర్డు పేర్కొంది.
ఉత్తరప్రదేశ్లోని మురాద్నగర్ ఎగువ గంగా కాలువ వార్షిక మరమ్మతుల కారణంగా దీనిపైన ఉన్న భగీరథి, సోనియా విహార్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు నీటి సరఫరాను నిలిపేశారని తెలిపింది. ఇప్పుడు ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు యమునా నదిపైనే ఆధారపడి ఉన్నాయని, కానీ ఈ నీటిలో 1.5 పీపీఎం కంటే ఎక్కువ అమ్మోనియా ఉండడంతో నీటి శుద్ధి కష్టతరంగా మారిందని పేర్కొన్నది. ఢిల్లీ ప్రజలు అవసరాల మేరకే నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది.