
ఆమె ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో ఉద్యోగి. రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో తెలిసిన వ్యక్తి కలిశాడు. ఇప్పటికే లేటయ్యింది. భోజనం చేసి వెళదాం అన్నాడు. తెలిసిన వ్యక్తే కదా అని ఆమె ఒప్పుకోవడమే ఆమె పాలిట శాపమయింది. ఓ ప్రైవేట్ హోటల్ కు తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. ఏకంగా నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీకి చెందిన భార్యభర్తలు వృత్తిరీత్యా బెంగళూరులో ఉంటున్నారు. భర్త ప్రైవేట్ సెల్యూలార్ సంస్థలో పనిచేస్తుండగా..ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలో ఉద్యోగి గా పనిచేస్తుంది. వృత్తి రీత్యా ఆమె అర్థరాత్రి వరకు పనిచేయాల్సి ఉంటుంది.పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుంగా.. మార్గమధ్యంలో తెలిసిన వ్యక్తి కలిసి భోజనం చేద్దామని బలవంత పెట్టాడు..తెలిసిన వ్యక్తే కదా..ఎలాగూ డిన్నర్ టైం అయిందని అతనితో కలిసి వెళ్లింది. అక్కడే ప్రమాదంలో పడింది.
Also Read :- కన్నతండ్రిని కత్తితో పొడిచి చంపిన కొడుకు
తెలిసిన వ్యక్తితోపాటు మరో ముగ్గురు వ్యక్తులు కలిసి ఆమెను బంధించి అత్యాచారం చేశారు.రాత్రంతా అక్కడే ఉంచి తెల్లవారుజామున పంపించేశారు. అతికష్టం మీద ఇంటికి చేరుకొని భర్తకు విషయం తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గురువారం (ఫిబ్రవరి 20) అర్థరాత్రి బెంగళూరులోని కోరమంగళలోని ఓ హోటల్ టెర్రస్ పై జరిగిన 30 యేళ్ల మహిళపై అత్యాచారం కేసులో పోలీసులు నలుగురు యువకులను అరెస్ట్ చేశారు.. వీరంతా 20యేళ్ల లోపువారే. నిందితులు అజిత్, శివు, విశ్వాస్, షిమోల్. శిమోల్ లుగా గుర్తించారు. వీరంతా వేర్వేరు హోటళ్లలో కుక్ లుగా, అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు.
శుక్రవారం బాధిత మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు వ్యక్తులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో పరిచారు.