- రాణించిన జెమీమా, క్యాప్సీ
- రిచా పోరాటం వృథా
న్యూఢిల్లీ: విమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. ఆదివారం ఆఖరి బాల్‌కు ఉత్కంఠగా సాగిన పోరులో ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క రన్ తేడాతో ఆర్‌సీబీపై గెలిచింది. లీగ్‌లో ఐదో విక్టరీతో మళ్లీ టాప్ ప్లేస్‌కు వచ్చిన ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. రిచా ఘోశ్ (29 బాల్స్‌లో4 ఫోర్లు, 3 సిక్సర్లతో 51) అద్భుతంగా పోరాడినా ఆఖరి బాల్‌కు రనౌటవడంతో ఆర్‌సీబీకి ఓటమి తప్పలేదు.
ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 181/5 స్కోరు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (36 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 58), ఎలైస్ క్యాప్సీ (32 బాల్స్‌లో 8 ఫోర్లతో 48) దంచికొట్టారు. ఓపెనర్లు మెగ్ లానింగ్ (26 బాల్స్‌లో 5 ఫోర్లతో 29), షెఫాలీ వర్మ (18 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 23) కూడా రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ (4/26) నాలుగు వికెట్లు తీసింది.
రిచా మెరిసినా
ఛేజింగ్‌లో ఆర్‌సీబీ 20 ఓవర్లలో 180/7 స్కోరు చేసి కొద్దిలో విజయాన్ని చేర్చుకుంది. కెప్టెన్ మంధాన (5) ఫెయిలైనా సోఫీ మొలినుక్స్ (33), ఎలైస్ పెర్రీ (32 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 49), సోఫీ డివైన్ (26), రిచా ఘోశ్ ఆర్‌సీబీని రేసులో నిలిపారు. జొనాసెన్ వేసిన చివరి ఓవర్లో 17 రన్స్ అవసరం అవగా తొలి, ఐదో బాల్స్ రిచా రెండు సిక్స్‌లు కొట్టింది. లాస్ట్ బాల్‌కు రెండు రన్స్ అవసరం అయ్యాయి. కానీ, ఆ బాల్‌ను బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడిన రిచా సింగిల్ తీసేలోపే ఫీల్డర్ షెఫాలీ వర్మ ఆమెను రనౌట్ చేయడంతో ఢిల్లీ గెలుపు అందుకుంది. జెమీమాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.