కొత్తరకం బిజినెస్..స్వచ్ఛమైన గాలిని అమ్ముతున్నరు..!

కొత్తరకం బిజినెస్..స్వచ్ఛమైన గాలిని అమ్ముతున్నరు..!
  • ఢిల్లీ, బెంగళూరు ఫైవ్ స్టార్ హోటళ్లలో సైన్‌‌బోర్డులు 

న్యూఢిల్లీ/బెంగళూరు:  దేశ రాజధానిలో రోజు రోజుకీ పెరుగుతున్న గాలి కాలుష్యం అక్కడి వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. సాధారణంగా 5 స్టార్ హోటళ్లు..డబ్బులు తీసుకుని ఫుడ్డు, బెడ్డు, మద్యం వంటివి కస్టమర్లకు సర్వీస్ చేస్తాయి. కానీ, ఢిల్లీలోని కొన్ని 5 స్టార్ హోటళ్లు ఇప్పుడు స్వచ్ఛమైన గాలిని అమ్మడం స్టార్ట్ చేశాయి. తమ హోటల్ లో సర్వీస్ చేసే లగ్జరీ వస్తువుల జాబితాలో గాలిని కూడా చేర్చాయి. హోటల్ ఎంట్రన్స్ లో  సైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డులు ఏర్పాటు చేసి మరీ కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇంజినీర్ అయిన దేబర్ఘ్య దాస్(డీడీ) ఇటీవల ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ కు వెళ్లారు. అక్కడ ఎంట్రన్స్ లో  సైన్ బోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూసి ఆశ్చర్యపోయారు. సిటీ ఏక్యూఐ 397గా ఉంటే తమ హోటల్ రూమ్స్ లో ఏక్యూఐ 58గా ఉందని సైన్ బోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యాజమాన్యం పేర్కొంది. తమ హోటల్ కు వచ్చేవారికి నాణ్యమైన ఎయిర్ సర్వీస్ చేస్తామని వెల్లడించింది. ఆ సైన్ బోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డీడీ ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది.  ఇక బెంగళూరులోనూ 'ది ఒబెరాయ్ బెంగళూరు' అనే ఫైవ్ స్టార్ హోటల్ ఎంట్రన్స్ లో గాలి నాణ్యతకు సంబంధించి ఉన్న సైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డును ప్రదర్శిస్తోంది. అందులో హోటల్ లోని గదుల గాలి నాణ్యత 2.4గా ఉందని ఆ హోటల్ యాజమాన్యం పేర్కొంది.  

ఢిల్లీలో ఆంక్షల సడలింపు 

ఢిల్లీలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (జీఆర్ఎపీ-4) నిబంధనల సడలింపునకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ-–ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఆర్ ప్రాంతాల్లో కాలుష్య నివారణ చర్యలపై బుధవారం విచారణ చేపట్టింది. తాజాగా గాలి నాణ్యతలో మెరుగుదల కనిపించడంతో జీఆర్ఎపీ-4 ఆంక్షల సడలింపునకు అనుమతిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఏక్యూఐ 0 నుంచి- 50 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగుందని అర్థం. 51నుంచి-100 మధ్య ఉంటే సాధారణ స్థితిలో ఉందని, 101 నుంచి- 200 మధ్య ఉంటే క్షీణ దశకు చేరువైనట్లు అర్థం. బుధవారం గాలి నాణ్యత 161గా నమోదు అయింది. దీంతో  గాలి నాణ్యతలో మెరుగవడంతో ఆంక్షల సడలింపునకు కోర్టు అనుమతిచ్చింది.