ఢిల్లీ న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఆక్రమణల తొలగింపు

ఢిల్లీలో ఆక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సౌత్ ఢిల్లీలో మరోసారి బుల్డోజర్ డ్రైవ్ చేపట్టారు. న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఆక్రమణలు కూల్చివేస్తున్నారు మున్సిపల్ అధికారులు. పారా మిలటరీ బలగాల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఈనెల 13 వరకు బుల్డోజర్ డ్రైవ్ కొనసాగుతుందన్నారు.డ్రైవ్ కోసం రోడ్ మ్యాప్ సిద్ధంగా ఉందని సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజ్ పాల్ సింగ్ తెలిపారు.నిన్న షాహీన్ బాగ్ లో చేపట్టిన ఆక్రమణల కూల్చివేతలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కూల్చివేతలపై సుప్రీం కోర్టును సీపీఐ పార్టీ ఆశ్రయించింది.కూల్చివేతలపై జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.గతంలో జహంగీర్ పురిలో చేపట్టిన బుల్డోజర్ డ్రైవ్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది.మరోవైపు ఆక్రమణల పేరుతో ముస్లింల ఇళ్లు కూల్చివేస్తుందని నిరసన తెలుపుతున్నారు పలువురు.

 

 

మరిన్ని వార్తల కోసం

గాలికి బ్రిడ్జ్ ఎలా కూలుతుందో నాకు అర్థం కావట్లేదు

అసని తుఫాన్ ఎఫెక్ట్ తో విశాఖకు విమానాలు రద్దు