రోజుకు 49 సిగరెట్లు తాగినంత.. ఢిల్లీలో గాలి ఇంత పొల్యూషన్

రోజుకు 49 సిగరెట్లు తాగినంత.. ఢిల్లీలో గాలి ఇంత పొల్యూషన్


 ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుతోంది.  ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రమాదకర  స్థాయికి దిగజారింది .  నవంబర్ 18 మధ్యాహ్నం నాటికి  ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్  (AQI) 978 వద్ద ఉంది. ఇది రోజుకు 49 సిగరెట్లు తాగడంతొ సమానం  అంట. అంటే 24 గంటల్లో ఒక వ్యక్తి రోజుకు 49 సిగరెట్లు తాగినంత గాలి కలుషితం అవుతోంది.

ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 18 నుంచి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. దీని ప్రకారం ఢిల్లీలో నిట్రక్కుల ప్రవేశాన్ని అధికారులు నిషే ధించారు. కేవలం నిత్యవసర సరకులు తీసుకువచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. అలాగే ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్ అయిన్ లైట్ మోటర్ గూడ్స్ వెహికల్స్ ను కూడా నిషేధించారు. బీఎస్ 4, డీజిల్ వాహనాలను కూడా అనుమ తించడంలేదు. నిర్మాణాలపై తాత్కాలి కంగా నిషేధం విధించారు. 

ALSO READ | ఢిల్లీలో గాలి పీల్చితే బతుకుడు కష్టమేనా..? ఫస్ట్ టైం 477కు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..

ఢిల్లీలో కాలుష్యం మరింతగా పెరగడంపై ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు  నవంబర్ 18న  ప్రశ్నించింది. కాలుష్య నియం త్రణ చర్యలు చేపట్టడంలో ఎందుకు లేట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్ కాల్విటీ ఇండెక్స్ 300 పాయింట్లు దాటిన తర్వాత మేము ఎందుకు వెయిట్ చేయాలి? అని ప్రశ్నించింది. ఢిల్లీలో గాలి నాణ్యత ఎప్పుడూ లేని స్థాయికి పడిపోయింది. విద్యార్థులకు  ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించారు. గవర్నమెంట్ కాలేజీలను క్లోజ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులతో పనిచేయాలని ఆదేశాలు జారీచేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క ఫ్రం హోం చేయాలని కోరారు.