
దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్సెగ రాజుకుంటున్నది. వచ్చే పార్లమెంట్ఎన్నికల నాటికి లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేయా లన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. అయితే కేంద్రం అందుకు అనుసరించబోతున్న విధానంపై సౌత్స్టేట్స్లో ఆందోళన నెలకొన్నది.
ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలవి కేవలం 129 సీట్లే. అంటే మొత్తం స్థానాల్లో సౌత్ వాటా కేవలం 24 శాతమే! 19 లక్షల జనాభాకు ఒక సీటు చొప్పున డీలిమిటేషన్జరిగితే ప్రస్తుతం ఉన్న మొత్తం లోక్‌సభ స్థానాలు 753కి పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల సీట్లు 144కి చేరుతాయి. మొత్తంగా సౌత్వాటా 19 శాతానికి పడిపోతుంది.
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలను ఇదే అంశం తీవ్రంగా కలవరపెడుతోంది. డీలిమిటేషన్జరిగితే సభలో ఉత్తరాది గుత్తాధిపత్యానికి తెరదీసినట్టవుతుందన్న ఆందోళన కనిపిస్తోంది. ఈ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో 3 సీట్లే పెరుగుతయ్..
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్చేస్తే తెలంగాణ, ఏపీలో మూడు చొప్పున సీట్లే పెరగనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్‌సభ సీట్లుండగా 20కి, ఏపీలో 25 ఉండగా 28కి పెరుగుతాయి. కేరళ పరిస్థితి అయితే దారుణమనే చెప్పాలి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 20 సీట్లుండగా ఒక స్థానానికి కోత పడి 19కి తగ్గుతాయి. తమిళనాడులో 39 సీట్లుండగా రెండు పెరిగి 41కి చేరుకుంటాయి.
కర్నాటకలో 28 స్థానాలుండగా, 36కి పెరుగుతాయి. దక్షిణాదిలో అంతో ఇంతో లాభపడేదంటే కర్ణాటకేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏ రకంగా చూసినా దక్షిణాదిలో పెరిగే సీట్లు 15 మాత్రమే. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బిహార్వంటివి భారీగా లాభపడనున్నాయి. ప్రస్తుతం యూపీలో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా, అవి 128కి చేరుకుంటాయి. బిహార్‌లో 40 సీట్లు ఉండగా 70కి, మధ్యప్రదేశ్లో 29 నుంచి 47కి, మహారాష్ట్రలో 48 నుంచి 68కి, రాజస్థాన్‌లో 25 నుంచి 44కి లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.