- హెల్మెట్ లేకుండా రాంగ్ రూట్ లో వెళ్తున్నరు
- డెలివరీ పార్టనర్స్ ప్రతినిధులతోట్రాఫిక్ డీసీపీ జోయల్ డేవిస్
హైదరాబాద్ సిటీ/గచ్చిబౌలి, వెలుగు: సిటీలో డెలివరీ బాయ్స్, బైక్ ట్యాక్సీ డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారని ట్రాఫిక్ డీసీపీ డి.జోయల్ డేవిస్ అన్నారు. హెల్మెట్ లేకుండా వెహికల్స్ నడపడమే కాకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ర్యాంగ్ రూట్వెళ్తున్నారన్నారు. కొందరు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు.
సైబరాబాద్ సీపీ ఆఫీస్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ ప్లాట్ ఫామ్ ప్రతినిధులతో ట్రాఫిక్ పోలీసులు కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో జోయల్ డేవిస్ పాల్గొని మాట్లాడారు. డెలివరీ సిబ్బంది షిఫ్ట్ ల ప్రారంభం, ముగింపులో మద్యం తాగారా లేదా అన్నది చెక్చేయాలన్నారు. ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా వేయడంతోపాటు ఉద్యోగం నుంచి తొలగించాలన్నారు.
జీపీఎస్ఆధారిత స్పీడ్ మానిటరింగ్ చేయాలని సూచించారు. అలాగే డెలివరీ బాయ్స్ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా జాయింట్ కమిషనర్ఆఫ్పోలీస్ ఆధ్వర్యంలోరోడ్ సేఫ్టీ సెషన్ లు నిర్వహించాలన్నారు. మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయిమనోహర్, సైబరాబాద్ ట్రాఫిక్ అడ్మినిస్ట్రేటర్లు బీఎన్ఎస్ రెడ్డి, జి. మరియా, ఆన్ లైన్ డెలివరీ ప్లాట్ ఫామ్స్, బైక్ టాక్సీ ఇన్చార్జీలు పాల్గొన్నారు.