ములకలపల్లి, వెలుగు : 108 వాహనంలోనే ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మండలంలోని వీకే రామవరం గ్రామానికి చెందిన మిడియం లక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి 108 కు సమాచారం ఇచ్చారు.
అంబులెన్స్ లో పాల్వంచకు తరలిస్తుండగా, మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో డాక్టర్ మనీశ్, ఈఎంటీ భాగ్యమ్మ, పైలెట్ అశోక్ అంబులెన్స్ లోనే డెలివరీ చేశారు. అనంతరం తల్లీబిడ్డలను పాల్వంచ ఏరియా ఆస్పతిలో అడ్మిట్ చేశారు.