
న్యూఢిల్లీ: లాజిస్టిక్ సంస్థ డెలివరీ, ఈకామ్ ఎక్స్‌ప్రెస్ తమ రూ.1,400 కోట్ల ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)అనుమతి కోరాయి. ఈ నెల ఐదున ప్రకటించిన ఒప్పందం ప్రకారం, ఈకామ్ ఎక్స్‌ప్రెస్‌లో డెలివరీ నియంత్రణ వాటాను రూ.1,400 కోట్ల నగదుకు కొనుగోలు చేస్తుంది. డెలివరీ లిస్టెడ్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ కంపెనీ కాగా, ఈకామ్ ఎక్స్‌ప్రెస్ భారతీయ ఈ–-కామర్స్ పరిశ్రమకు లాజిస్టిక్స్ సేవలను అందిస్తుంది.
రెగ్యులేటరీ ఏజెన్సీకి అందించిన నోటీసు ప్రకారం, ఏయే ఉత్పత్తులు, ఏయే ప్రాంతాలలో ఈ ఒప్పందం వర్తిస్తుంది అనే విషయాలను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని సాధారణంగానే పరిగణించవచ్చు. ఎందుకంటే ప్రతిపాదిత ఒప్పందం భారతదేశంలోని ఏ మార్కెట్‌లోనైనా పోటీపై ప్రభావం ఉండదని ఈ రెండు సంస్థలు పేర్కొన్నాయి.