
డోర్‌డాష్ డెలివరీ బాయ్.. కస్టమర్ ఆహారంపై ఉమ్మివేసిన షాకింగ్ ఫుటేజ్ ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడాలోని సౌత్‌వెస్ట్ 107వ అవెన్యూలోని ట్రీ టాప్స్ అపార్ట్‌మెంట్‌లో సెప్టెంబర్ 9న మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ వైరల్ వీడియోలో డెలివరీ డ్రైవర్ డోర్‌స్టెప్ దగ్గర కస్టమర్ ఆర్డర్‌ను ఉంచినట్లు చూపిస్తుంది. ఆ వ్యక్తి డెలివరీకి సంబంధించిన ఫొటోను సాక్ష్యంగా క్లిక్ చేయడం ప్రారంభించాడు. కానీ ఆ తర్వాత జరిగిన సన్నివేశం సోషల్ మీడియా యూజర్స్ అసహ్యించుకునేలా ఉంది.
Also Read :- పాస్తా ఇలా తింటే చచ్చిపోతారట..
తక్కువ టిప్ ఇచ్చారన్న కోపంతో ఉన్న డెలివరీ వ్యక్తి సుమారు మూడుసార్లు ఆర్డర్‌పై ఉమ్మివేశాడు. "వారు నాకు 1డాలర్ ను కూడా వదిలిపెట్టలేదు" అని గొణుక్కుంటూ ఆ వ్యక్తి ఈ వికృత చేష్టకు పాల్పడ్డాడు. ఈ తర్వాత, డోర్‌డాష్ ఉద్యోగి ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ఈ ఫుటేజ్ లో సోషల్ మీడియా యూజర్స్ ను కోపం తెప్పించింది. చాలా మంది అతన్ని తొలగించమని డిమాండ్ చేశారు. టిప్పు ఇవ్వడమేం తప్పనిసరి కాదు అంటూ ఒకరు కామెంట్ చేశారు. వారు టిప్ ఇవ్వకపోయినా ఫుడ్ డెలివరీ చేయడం మీ బాధ్యత. కానీ ఇది చాలా అసహ్యంగా ఉంది అంటూ మరొకరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.